వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇవాళ జరిగిన కౌన్సి ల్ సమావేశం లో కార్పొరేటర్లు గణేష్, అర్షిత రెడ్డి, బయ్యస్వామి ఆయన పేరును ప్రతిపాదించారు. ఎవరూ పోటీలో లేకపోవడంతో గుండా ప్రకాష్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు,ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
మేయర్ పదవికి పెద్దసంఖ్యలో ఆశావాహులు పోటీపడటంతో ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్టానానికి వదిలేశారు స్ధానిక నేతలు. సుదీర్ఘ మంతనాల అనంతరం ప్రకాష్ రావు పేరును అధికారికంగా ప్రకటించింది టీఆర్ఎస్.
ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రకాష్ రావు మృధుస్వభావి. వాసవి క్లబ్ మజీ గవర్నర్‌గా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్‌లో సీనియర్ నేతగా ఉన్నారు. 26వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
2016 ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన నన్నపునేని నరేం దర్‌కు పార్టీ అవకాశం కల్పించింది. నరేందర్ తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యం లో మేయర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో మేయర్ ఎన్నిక అనివార్యమైంది.