“డియర్ కామ్రేడ్ “వాయిదాకు కారణమేంటో తెలుసా?

184
dear-Comrade

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. ఈసినిమాలో విజయ్ సరసన రష్మీక మందన కథనాయికగా నటిస్తుంది. విజయ్ స్టూడెంట్ పాత్రలో నటించగా..రష్మీక క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. మొదట ఈమూవీని మే31న విడుదల చేయాలని భావించారు.

అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసినిమాను జూన్ 19న విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. మరోవైపు అదే రోజు తమిళ హీరో సూర్య నటించిన ఎన్జీకే మూవీ విడుదల కానుండటంతో విజయ్ రేసు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈసినిమా అవుట్ పట్ల విజయ్ సంతృప్తిగా లేడని కొన్ని సీన్లను రీ షూట్ చేయనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఈకారణం చేత కూడా మూవీ విడుదల కాస్త లేట్ అవుతుందని చెబుతున్నారు. విజయ్ చివరగా నటించిన ట్యాక్సివాలా సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డియర్ కామ్రేడ్ మూవీ విడుదల గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. జూన్ 19న అయిన ధియేటర్లలోకి వస్తుందో రాదో చూడాలి మరి.