గుణశేఖర్…శాకుంతలం

220
gunashekar

దర్శకుడు గుణశేఖర్ తన నెక్ట్స్ ప్రాజెక్టును అనౌన్స్‌ చేశారు. ప్రస్తుతం రానాతో హిరణ్యకశ్యప చేస్తున్న గుణశేఖర్ తాజాగా శాకుంతలంతో రానున్నాడు.వెండితెరపై ‘హిరణ్యకశ్యప’ లోని నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. మహాభారతం ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథను ఆవిష్కరిస్తున్నాను అని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించి మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. మరచిపోయిన ప్రేమ.. మరచిపోలేని ప్రేమ కథ అని మోషన్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇక హిరణ్యకశ్యప మూవీని గుణశేఖర్ దర్శకత్వంలో సురేష్ బాబు ప్రముఖ అంతర్జాతీ నిర్మాణ సంస్థతో కలిసి దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్దం అయ్యారు. అయితే తాజాగా ఈ సినిమాను పక్కనపెట్టి శాకుంతలం చేస్తున్నట్లు ప్రకటించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.