టీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను పరామర్శించిన ప్రశాంత్ రెడ్డి..

112
prashanth reddy

భీంగల్ మరియు వేల్పూర్ మండలాలలో పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. .వేల్పూర్ టి.ఆర్.ఎస్ నాయకులు సోక్ మియా మోహన్ గారి తండ్రి గారు ఇటీవల కాలం చేయడం జరిగింది,వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డం బాలయ్య ఇటీవల కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను, భీంగల్ టి.ఆర్.ఎస్ నాయకులు కన్నె సురేందర్ తల్లి ఇటీవల కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వేల్పూర్ మండలము మోతె గ్రామానికి చెందిన టి.ఆర్.ఎస్ నాయకులు నక్క మోహన్ యాదవ్ తండ్రి మరణించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రమాదవశాత్తు మక్క కోత మిషిన్ పైన బోర్లా పడటంతో వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన ఒక మహిళ మరణించడంతో పాటు ముగ్గురు గాయపడటము జరిగింది..వారి కుటుంబాలను పరామర్శించారు. జాగిర్యాల్ గ్రామానికి చెందిన టి.ఆర్.ఎస్ నాయకులు రాజమల్లు తల్లి ఇటీవల కాలము చేయడంతో వారి ని కుటుంబ సభ్యులను పరామర్శించారు.