గ్రాడ్యుయేట్స్‌ ఓటు నమోదుచేసుకోండి:ఎమ్మెల్యే కాంతారావు

121
mla kantharao

పట్టభద్రులందరూ విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు. ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ – న‌ల్ల‌గొండ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేప‌థ్యంలో ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మంపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఓటరు నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించిన కాంతారావు….. వీలైనంత వ‌ర‌కు గ్రామాల్లో ప‌ర్య‌టించి ప‌ట్ట‌భ‌ద్రుల‌ను గుర్తించి ఓటు న‌మోదు చేసుకునే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం సమర్పించే దరఖాస్తులలో సమాచారం పూర్తి స్థాయిలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 2017 సంవత్సరానికి ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు అవుతారని వివరించారు.