గుమ్మడి కాయ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో!

44
- Advertisement -

గుమ్మడి కాయను చాలమంది ఇంటి ముందు దిష్టి వస్తువుగా ఉపయోగిస్తుంటారు. మరికొందరేమో గుమ్మడి కాయతో రుచికరమైన చట్నీ, కర్రీ వంటివి కూడా తయారు చేస్తారు. అయితే గుమ్మడి కాయతో చేసిన వంటకాలను తినడానికి చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు. అలాంటి వారు గుమ్మడి కాయను జ్యూస్ రూపంలో సేవిస్తే ఎంతో మేలని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఎందుకంటే గుమ్మడి కాయ జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు ఉంటాయి. కాబట్టి అధిక బరువుతో బాధపడే వారు ప్రతిరోజూ ఒక గ్లాస్ గుమ్మడి కాయ జ్యూస్ తాగి ఆ తరువాత వ్యాయామం చేస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుందట. ఇంకా ఇందులో ఉండే విటమిన్, సి, బి కాంప్లెక్స్, విటమిన్ ఎ, ఇ.. వంటివి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. .

ఇంకా గుమ్మడిలో రక్తపోటును అదుపులో ఉంచే గుణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆహార నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో మలబద్ధకం, గ్యాస్టిక్ సమస్యలతో బాధపడుతుంటారు చాలమంది. అలాంటి వారు ప్రతిరోజూ ఖాళీ కడుపున గుమ్మడి రసం సేవిస్తే ఎలాంటి ఉదర సమస్యలైన దూరమౌతాయట. ఇంకా శ్వాసకొస వ్యాధి గ్రస్తులకు, షుగర్ పేషెంట్లకు గుమ్మడి రసం ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు షుగర్ ను కంట్రోల్ చేయడంతో పాటు, ఉబ్బసం, ఆస్తమా వంటి వ్యాధులను కూడా నిలువరిస్తాయట. కాబట్టి గుమ్మడి కాయ జ్యూస్ ను తాగడం చాలా మంచిది. ప్రతిరోజూ తాగడానికి వీలు కుదరకపోయినప్పటికి వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు అయిన గుమ్మడి కాయ రసం తాగాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:Chandrababu:బాబు హామీల వర్షం!

- Advertisement -