సేవ్య రోత్సవం కుటుంబానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆర్ధిక సహాయం..

222
- Advertisement -

బహరేన్ లో మరణించిన, సేవ్య రోత్సవం (బట్టు) కుటుంబానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అద్వర్యంలో Rs 1,83. 861/- రూపాయల ఆర్ధిక సహయాన్ని అందజేశారు. కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలంలోని, రెడ్డిపేట్ తండాకు చెందిన, సేవ్య రోత్సవం (బట్టు), వయసు 32, పాస్పోర్ట్ నెంబర్ M3852123, నస్ కంపెనీలో దురదృష్టవశాత్తు గుండె పోటుతో మృతి చెందాడు.  Gulf NRI TRSL  behreine

వారి సార్థవ దేహాన్ని మృతిచెందిన 13 రోజుల్లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తేదీ 24.06.17రోజున స్వగ్రామానికి పంపించారు. సేవ్య రోత్సవం అకాల మరణంతో తల్లి, భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే అతని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయింన ఆ పేద కుటుంబ పరిస్థితులను చూసి నేను సైతం అంటూ ముందుకు వచ్చారు ఎన్నారై టీఆర్ఎస్ బహరేన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి. ఈయనతో పాటు తోటి కంపనీ లో పనిచేసే కార్మికులు వారి గ్రామానికి చెందిన రవీందర్ నాయకు, బాలు రాతుల, కిసాన్ బట్టు, కొంపెల్లి వెంకటేశ్, lpn ప్రకాష్, గంగవత్ బాలు, చంద్ర లిoగాయా, చెన్య, రమేష్ భూక్య, రవి హర్యా, బాలు బుధ్య, బుక్క రెడ్డి, గంగవత్ జావార్లల్ వారి అద్వర్యంలో ఆర్థిక సాయంగా రూ.1,83. 861/- విరాళాలుగా సేకరించి మొత్తాన్ని ఆ బాదిత కుటుంబానికి అందచేశారు.

ఎంతో అభిమానంతో ఆదరించి ఇంత గొప్ప సహయాన్ని మరణించిన సేవ్య రోత్సవం (బట్టు) కుటుంబానికి అందేలా కృషి చేసిన వారి కృషిని, ఐక్యతను, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి తో పాటు తదితరులు ప్రశంసించారు.

- Advertisement -