రాణించిన రైనా,కార్తీక్‌…లయన్స్ భారీ స్కోరు

230
Gujarat Lions and Raina in rebuild mode
- Advertisement -

ఐపీఎల్‌ 10లో భాగంగా రాజ్‌ కోట్‌లో గుజరాత్‌ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ భారీ స్కోరు సాధించింది. తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లపై ఓపెనర్లు జాసన్ రాయ్ (14), మెక్ కల్లమ్‌లు విరుచుకపడ్డారు. వీరి భాగస్వామ్యాన్ని పియూష్ చావ్లా విడదీయగా మరోవైపు మెక్ కల్లమ్‌ తన దైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన ఆరోన్ ఫించ్ (15) ను త్వరగా ఔటైనా కెప్టెన్‌ సురేష్ రైనాతో కలిసి కార్తీక్ జట్టు స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు.

తొలుత ఆచితూచి ఆడిన వీరిద్దరు తర్వాత గ్రౌండ్ నలువైపులా బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దరి ధాటికి గుజరాత్ భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. కెప్టెన్ రైనా 51 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేయగా కార్తీక్ 24 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్సర్లతో 47 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 183 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, పీయూష్ చావ్లా,బౌల్ట్ తలో వికెట్ తీశారు.

గుజరాత్ జట్టు: సురేష్ రైనా(కెప్టెన్), డ్వేన్ స్మిత్, బ్రెండన్ మెకల్లమ్, అరోన్ ఫించ్, దినేష్ కార్తీక్, ఎంఎస్ గోనీ, ప్రవీణ్ కుమార్,జకాతి, ధావల్ కులకర్ణి, శివల్ కౌశిక్

కోల్ కతా జట్టు: గౌతం గంభీర్(కెప్టెన్), రాబిన్ ఊతప్ప, మనీష్ పాండే,క్రిస్ లయన్, యూసఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్, క్రిస్ వోక్స్, పీయూష్ చాహ్లా, కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్, బౌల్ట్

- Advertisement -