ఈ నెల 21న విజయవాడకు ‘గూడుపుఠాణి’ టీమ్..

181
- Advertisement -

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన చిత్రం “గూడుపుఠాణి “. డిసెంబర్ 25న గ్రాండ్‌గా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఈ నెల 21న విజయవాడలో సందడి చేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. దీని సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఇక సప్తగిరి తనదైన శైలి నటనతో మెప్పించడానికి ‘గూడుపుఠాణి’ వస్తున్నాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సపగిరి ఎల్ఎల్బి తరువాత సప్తగిరి హీరోగా వస్తోన్న మూడో చిత్రం ఇది.సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు దర్శకుడు కె.ఎమ్ కుమార్. రఘు కుంచె మరోసారి తన విలనిజంతో మెప్పించబోతున్నాడు. గూడుపుఠాణి చిత్రం కొన్ని ఏరియాల్లో బ్రహ్మాండమైన బిజినెస్ అవ్వడంతో చిత్ర నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -