- Advertisement -
అఖిల్ అక్కినేని ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ మూవీ నుండి ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు ఓ పాటను విడుదల చేశారు. ‘అరె గుచ్చే గులాబిలాగా నాగుండె లోతునే తాకినదే.. వెలుగిచ్చే మతాబిలాగా నా రెండు కళ్ళలో నిండినదే..’ అంటూ విభ మీద తన ప్రేమభావనను పాట రూపంలో పాడుతున్నారు అఖిల్.
అఖిల్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసువర్మ నిర్మిస్తున్నారు. జూన్ 19న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆమని, మురళీకృష్ణ , జయప్రకాశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్.
- Advertisement -

