- Advertisement -
నటి హన్సిక ప్రధాన పాత్రలో గురు శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గార్డియన్. తమిళ్‌లో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ తమిళ ప్రేక్షకులకు నచ్చేసింది. అయితే తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. భవాని మీడియా ద్వారా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక ఆత్మ రివెంజ్ తీర్చుకోడానికి తిరిగొచ్చి హన్సిక శరీరంలోకి వెళ్లి ఏం చేసింది, ఎవర్ని భయపెట్టింది అని హారర్ సినిమాగా తెరకెక్కించారు.
ఈ సినిమాకి సామ్ సి.ఎస్. అదిరిపోయే హారర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. హారర్ సినిమాలు ఇష్టపడేవాళ్లు హాన్సిక గార్డియన్‌ను చూసేయండి.
Also Read:బెట్టింగ్ యాప్స్ కేసులు సీఐడీకి!
- Advertisement -

