- Advertisement -
గుజరాత్‌లో కమలం మరోసారి వికసించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. మొత్తం 182 స్ధానాలకు గాను 130కి పైగా స్ధానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
ఇక ఆప్ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా కాంగ్రెస్ 39 స్ధానాల్లో లీడ్‌లో ఉంది. ఇతరులు కూడా పలు స్ధానాల్లో సత్తాచాటుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగుతుందనుకోగా ఆప్ నామామాత్రానికే పరిమితమైంది.
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది. 2002లో ఆ పార్టీ 127 స్థానాలను సాధించగా, ప్రస్తుతం 130 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపుద్వారా తమకు తిరుగులేదని నిరూపించనుంది బీజేపీ.
ఇవి కూడా చదవండి..
- Advertisement -