జీఎస్టీ ఎఫెక్ట్: తగ్గేవి – పెరిగేవి ఇవే

226
GST: Snack sales likely to be hit
- Advertisement -

ఒకే దేశం – ఒకే పన్ను – ఒకే మార్కెట్ కు దేశం సన్నద్ధం అవుతుంది. మరికొన్ని గంటల్లో కొత్త వ్యవస్థలోకి అడుగుపెడుతున్నాం. దేశంలోని ప్రతి మనిషిపై జీఎస్టీ ప్రభావం ఉంటుంది. ఇప్పటి వరకు వస్తువుపై విధిస్తున్న పన్ను విధానం మొత్తం సమూలంగా మారబోతుంది. దేశంలోని పన్ను సంస్కరణల్లో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న జీఎస్టీని(వస్తు సేవల పన్ను) స్వాగతించేందుకు కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ వేదికగాశుక్రవారం అర్ధరాత్రి వేడుకలు నిర్వహించి జీఎస్టీని అమల్లోకి తీసుకురానున్నారు.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత  ఆయా వస్తువులపై ప్రస్తుతం పన్ను ఎంత ఉంది.. జీఎస్టీ తర్వాత వాటి ధర తగ్గుతుందా పెరుగుతుందా చూద్దాం…రోజువారీ వినియోగంలో ఇవి కొన్ని మాత్రమే.  మొత్తం 1200 వస్తువుల ధరలు మారబోతున్నాయి.

0 శాతం పన్ను: తాజా కూరగాయలు, గోధుమలు, మైదా, శనగపిండి, పెరుగు, మజ్జిగ, లస్సీ, తేనె, ఉప్పు, తిలకం, కాటుక, పాలపొడి, టీ, కాఫీ, మసాలాలు, కిస్ మిస్, జీడిపప్పు, ఔషధాలు, చక్కెర, బొగ్గు,. వైద్య సేవలు, ముద్రించిన పుస్తకాలు, వార్తా పత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు, గుడ్లు, అగర్ బత్తీలు, వంట నూనెలు, పాదరక్షలు (రూ. 500 లోపు)

12 శాతం పన్ను పరిధిలో: ఆయుర్వేద మందులు, పళ్లపొడి, వెన్న, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, సాస్, సూప్ లు, ఇన్ స్టంట్ ఫుడ్, ఐస్ క్రీమ్, హెల్మెట్లు, కుట్టు మిషన్లు, సెల్ ఫోన్లు (లో ఎండ్), పాల డబ్బాలు, రుమాళ్లు, నోటు పుస్తకాలు, స్టీల్ ప్రొడక్టులు, కెమెరాలు, స్పీకర్లు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, టిష్యూలు, మానిటర్లు తదితరాలు.

28 శాతం పన్ను: చూయింగ్ గమ్, చాక్లెట్లు, పాన్ మనాసాలు, పొగాకు ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్, పెయింట్స్, సన్ స్క్రీన్స్ వంటి సౌందర్య పోషక ఉత్పత్తులు, డిష్ వాషర్లు, వేయింగ్ మెషీన్లు, వాషింగ్ మెషీన్లు తదితరాలు.

బంగారం:  జీఎస్టీకి ముందు రూ. 5 లక్షలు – రేపటి నుంచి రూ. 4.95 లక్షలు
బ్రాండెడ్ దుస్తులు: జీఎస్టీకి ముందు రూ. 500 – రేపటి నుంచి రూ. 490
ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు: జీఎస్టీకి ముందు రూ. 30,000 – రేపటి నుంచి రూ. 31,200
ఫ్రిజ్: జీఎస్టీకి ముందు రూ. 1,5000 – రేపటి నుంచి రూ. 15,600
ల్యాప్ టాప్: జీఎస్టీకి ముందు రూ. 20,000 – రేపటి నుంచి రూ. 20,200
వాషింగ్ మెషీన్: జీఎస్టీకి ముందు రూ. 25,000 – రేపటి నుంచి రూ. 25,600
మొబైల్ ఫోన్లు: జీఎస్టీకి ముందు రూ. 10,000 – రేపటి నుంచి రూ. 9,600
వ్యవసాయ ఉత్పత్తులు: జీఎస్టీకి ముందు రూ. 10,000 – రేపటి నుంచి రూ. 10,600
బడ్జెట్ ధరలో లభించే చిన్న కారు: జీఎస్టీకి ముందు రూ. 3 లక్షలు – రేపటి నుంచి రూ. 2.91 లక్షలు
లగ్జరీ కార్లు: జీఎస్టీకి ముందు రూ. 60 లక్షలు – రేపటి నుంచి రూ. 57.60 లక్షలు
బైక్: జీఎస్టీకి ముందు రూ. 60,000 – రేపటి నుంచి రూ. 60,600
స్కూటర్: జీఎస్టీకి ముందు రూ. 35,000 – రేపటి నుంచి రూ. 35,300
పిజ్జా: జీఎస్టీకి ముందు రూ. 200 – రేపటి నుంచి రూ. 194
చిప్స్: జీఎస్టీకి ముందు రూ. 20 – రేపటి నుంచి రూ. 19.60
టీ: జీఎస్టీకి ముందు రూ. 20 – రేపటి నుంచి రూ. 19.40
కాఫీ: జీఎస్టీకి ముందు రూ. 50 – రేపటి నుంచి రూ. 51.50
బర్గర్: జీఎస్టీకి ముందు రూ. 1,00 – రేపటి నుంచి రూ. 97
వంట నూనె: జీఎస్టీకి ముందు రూ. 1,00 – రేపటి నుంచి రూ. 96
హెయిర్ ఆయిల్: జీఎస్టీకి ముందు రూ. 30 – రేపటి నుంచి రూ. 28.50
టూత్ పేస్టు: జీఎస్టీకి ముందు రూ. 50 – రేపటి నుంచి రూ. 47
సబ్బులు: జీఎస్టీకి ముందు రూ. 30 – రేపటి నుంచి రూ. 28.20
చెప్పులు, షూస్: జీఎస్టీకి ముందు రూ. 500 – రేపటి నుంచి రూ. 515
టెలిఫోన్ బిల్లు:  జీఎస్టీకి ముందు రూ. 1,000 – రేపటి నుంచి రూ. 1,025
బీమా ప్రీమియం:  జీఎస్టీకి ముందు రూ. 1,000 – రేపటి నుంచి రూ. 1,250
విమానం టికెట్:  జీఎస్టీకి ముందు రూ. 5,000 – రేపటి నుంచి రూ. 4,900
రైలు టికెట్:  జీఎస్టీకి ముందు రూ. 1,500 – రేపటి నుంచి రూ. 1,485
హోటల్ లో బస:  జీఎస్టీకి ముందు రూ. 7,500 – రేపటి నుంచి రూ. 7,425
నాన్ ఏసీ రెస్టారెంట్ భోజనం:  జీఎస్టీకి ముందు రూ. 1,000 – రేపటి నుంచి రూ. 970
ఏసీ రెస్టారెంట్ భోజనం:  జీఎస్టీకి ముందు రూ. 1,000 – రేపటి నుంచి రూ. 1,030
సినిమా టికెట్: జీఎస్టీకి ముందు రూ. 80 – రేపటి నుంచి రూ. 82
మెడిసిన్: జీఎస్టీకి ముందు రూ. 500 – రేపటి నుంచి రూ. 505

- Advertisement -