- Advertisement -
టాలీవుడ్ కు సంబంధించిన పలువురు దర్శకులు, రచయితలు, నిర్మాతల ఇళ్లపై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 15 మంది ప్రముఖుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. తప్పుడు ఆదాయాన్ని చూపి జీఎస్టీని తక్కువగా చెల్లించారన్న ఆరోపణలపై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా ఉన్న సమాచారం మేరకు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి , త్రివిక్రమ్ శ్రీనివాస్, వక్కంతం వంశీ కార్యాలయాలపై, సినీ నిర్మాణ సంస్థ హారికా హాసినీ క్రియేషన్స్, సితారా ఎంటర్ టెయిన్ మెంట్స్ కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి. సినీ రంగానికి చెందిన వారితో పాటు బిల్డర్స్, స్టీల్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -