జీఎస్టీ పరిహారం కోసం ఏజీ తప్పనిసరి..

46
- Advertisement -

రాష్ట్రాల ఆలసత్వం వల్లే కేంద్రం జీఎస్‌టీ చెల్లింపులో ఆలస్యం జరుగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సోమవారం ఆమె సమాధానమిచ్చారు. ఆయా రాష్ట్రాలు ఏజీ(అకౌంటెంట్ జనరల్‌) సర్టిఫికేట్‌ను సమర్పించకపోవడం వల్లే ఈ ఆలస్యం జరుగుతుందన్నారు. 2017-18 నుంచి కేరళ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఏజీ సమర్పించలేదన్నారు.

అయితే గతేడాది మే31నాటికి అన్ని రాష్ట్రాలకు రూ.86,912కోట్లను జీఎస్టీ పరిహారం విడుదల చేసినట్టు తెలిపారు. జీఎస్టీ పరిహారాన్ని ఎవరికి విడుదల చేయాలనేది చట్ట ప్రకారం జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వం కాదన్నారు. రాష్ట్రాలు కేంద్రం మధ్య ఈ చెల్లింపులు సజావుగా జరగాలంటే ఏజీ సర్టిఫికేట్‌ తప్పనిసరి అన్నారు. పైగా ఇది అందరి అంగీకారం పొందిన విషయమేన్నారు. ఏజీ సర్టిఫికేట్‌ ఆలస్యం జరిగితే అది ఏజీ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని వెల్లడించారు. సకాలంలో ఏజీ సర్టిఫికేట్‌లు సమర్పిస్తే జీఎస్టీ పరిహరం బకాయిలు ఉండవన్నారు.

ఈ సందర్భంగా కేరళ రాష్ట్రం ప్రస్తావిస్తూ…జీఎస్టీ పరిహారం బకాయిల కోసం 2017-18 నుంచి 2020-21వరకు ఒక్కసారి కూడా ఆ రాష్ట్రం ఏజీ సర్టిఫికేట్‌ పంపించలేదని తెలిపారు. అయినా…కేంద్రం సకాలంలో బాకాయిలు విడుదల చేయడంలేదని నిందిస్తున్నారన్నారు. ఇదే ఆంశంపై అనుబంధ ప్రశ్న వేసిన కేరళ ఎంపీ ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌కు..రాష్ట్రప్రభుత్వంతో ఒకసారి కూర్చొని ఏజీ సర్టిఫికేట్‌ను పంపించాలని కోరారు.

ఇవి కూడా చదవండి…

ఆ మాట సాయమే మోదీని కాపాడింది..

ఘర్ వాపసే..సొంత గూటికి ఈటల?

బీజేపీ కపట ప్రేమ.. తమిళులు నమ్ముతారా?

- Advertisement -