ఆగస్ట్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు… టాప్‌లో మహారాష్ట్ర

88
gst
- Advertisement -

దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆగస్టు నెలకు గానూ రూ.1,43,612 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. గతేడాదితో పోలిస్తే 28శాతం వృద్ధి నమోదు…కాగా ఈ ఏడాది జూలై నెలతో పోల్చినప్పుడు 4శాతం వృద్ధి కనిపించింది. గతేడాది ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు రూ.1,12,020కోట్లుగా నమోదయ్యాయి.

 

ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లలో రూ.24,710కోట్లు సీజీఎస్టీ కాగా రూ.30,951కోట్లు ఎస్‌జీఎస్టీ రూపంలో వచ్చాయి. రూ.77,782కోట్లు ఐజీఎస్టీ రూపంలో వసూలు కాగా సెస్సుల రూపంలో మరో రూ.10,168కోట్లు సమకూరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో తొలి ఐదు నెలల్లో రూ.7.46లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. గతేడాది తొలి ఐదు నెలలతో పోలిస్తే ఈ మొత్తం 33శాతం అధికం.

జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న పలు చర్యలు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం భారీ స్థాయిలో జీఎస్టీ వసూళ్లకు దోహదం చేసినట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక రాష్ట్రాల పరంగా చూసే రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ గతేడాది రూ.3,526కోట్లుగా ఉన్న వసూళ్లు 10శాతం వృద్ధితో రూ.3,871కోట్లుగా నమోదయ్యాయి. వృద్ధి పరంగా ఏపీ, వసూళ్ల పరంగా తెలంగాణ ముందంజలో నిలిచాయి. రాష్ట్రాలన్నింటిలో కెల్లా మహారాష్ట్ర అత్యధిక వసూళ్లు సాధించింది. గతేడాది రూ.15,175కోట్లుగా ఉన్న ఆ రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది రూ.18,863కోట్లకు పెరిగాయి.

 

gs

 

- Advertisement -