గృహసారథులు.. వచ్చేస్తున్నారోచ్!

60
jagan cm
- Advertisement -

ఏపీలో సి‌ఎం జగన్మోహన్ రెడ్డి గృహసారథులను నియమించబోతున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ” జగనన్నే మా భవిష్యత్ ” కార్యక్రమంలో భాగంగా ఈ గృహ సారథులు పని చేయనున్నారు. ఏపీలోని పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ప్రతి ఇంటికి వెళ్ళి సి‌ఎం జగన్ చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించడమే ఈ గృహ సారథుల ప్రధాన విధి. అంతే కాకుండా మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రతి ఇంటికి జగన్ పోటో ఉన్న స్టిక్కర్స్ ను కూడా అంటించాల్సి ఉంటుంది. అయితే ఈ గృహసారథులు ప్రభుత్వనికి సంబంధించిన వాళ్ళ ? లేదా పార్టీ కి సంబంధించిన వాళ్ల ? అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఇక రేపటి నుంచి అనగా ఏప్రెల్ 7 నుంచి గృహసారథులు వారియొక్క పనుల్లో పాల్గొంటారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తాజాగా వెల్లడించారు.

దాదాపు 7 లక్షల మంది గృహసారథులు కోటి 60 లక్షల ఇళ్లకు వెళ్లనున్నట్లు సజ్జల చెప్పుకొచ్చారు. ఈ గృహసారథులు ప్రతి ఇంటికి వెళ్ళి గతంలో పాలనకు ప్రస్తుతం జగన్ పాలనకు మద్య తేడాను వివరిస్తారని సజ్జల చెప్పుకొచ్చారు. తన పరిపాలనలో మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయండని చెప్పడం జగన్ కే చెల్లిందని ప్రపంచంలో ఎవరు కూడా ఇలా చెప్పి ఉండరని సజ్జల అన్నారు. ఇదిలా ఉంచితే గృహ సారతులకు పోటీగా టీడీపీ కూడా కుటుంబ సారథులను నియమించబోతున్నాట్లు చంద్రబాబు గతంలోనే స్పష్టం చేశారు. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రెండు ప్రధాన పార్టీలు అధికారం కోసం గట్టిగానే వ్యూహాలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఏపీ ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురుచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి…

KCR:కే‌సీ‌ఆర్ తో మాములుగుండదు మరి !

Komatireddy: పార్టీ మార్పుపై క్లారిటీ

Kanti Velugu:గొప్ప కార్యక్రమం

- Advertisement -