గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు..టీఎస్‌పీఎస్సీ

23
- Advertisement -

టీఎస్‌పీఎస్సీలో లీకుల కారణంగా తెలంగాణలో ఇప్పటికే నిర్వహించిన గ్రూప్‌-1 ఎక్సామ్‌ను రద్దు చేసినట్టు టీఎస్‌పీఎస్సీ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ ప్రకటించింది. దీంతో పాటు ఏఈఈ డీఏవో ఎగ్జామ్స్‌ను కూడా రద్దు చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఏఈ, టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌16న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించగా దాదాపుగా మెయిన్స్‌ కోసం 25వేల మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ యేడాది జనవరి22 ఏఈఈ పరీక్ష, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

పట్టాభిషేక సంవత్సరం.. కోహినూర్‌ ప్రదర్శన

వైరల్ అవుతున్న రాహుల్‌ కామెంట్‌..!

సీఎం..స్వప్నలోక్‌ బాధితులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా.!

- Advertisement -