పండగలా టీఆర్ఎస్‌ జిల్లా కార్యాలయాలకు భూమిపూజ

363
ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) జిల్లా కార్యాలయాలకు భూమిపూజ కార్యక్రమం పండగలా జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 29 జిల్లాల్లో మంత్రులు,జడ్పీ చైర్మన్లు పార్టీ కార్యాలయాలకు భూమిపూజ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు,నేతలు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా కార్యాలయాన్ని ఈటల రాజేందర్,నిర్మల్- అల్లోల ఇంద్రకరణ్రెడ్డి,నిజామాబాద్- వేముల ప్రశాంత్ రెడ్డి,జగిత్యాల- కొప్పుల ఈశ్వర్,జనగాం- ఎర్రబెల్లి దయాకర్ రావు,సూర్యాపేట- గుంతకండ్ల జగదీష్ రెడ్డి,మేడ్చల్- సిహెచ్ మల్లా రెడ్డి,మహబూబ్ నగర్- శ్రీనివాస్ గౌడ్,జోగులాంబ గద్వాల్- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.

జడ్పీ ఛైర్మన్లు అసిఫాబాద్- కోవా లక్ష్మి, మంచిర్యాల –భాగ్యలక్ష్మి, ఆదిలాబాద్- జనార్దన్ రాథోడ్, కామారెడ్డి- ధాపేధార్ శోభ, సిరిసిల్ల- అరుణ, పెద్దపల్లి- పుట్టమధు, జయశంకర్ భూపాలపల్లి- శ్రీ హర్షిని, మహబూబాబాద్- అంగోత్ బిందు, ములుగు- కుసుమ జగదీష్, భద్రాద్రి కొత్తగూడెం- కోరం కనకయ్య, , నల్లగొండ- బండా నరేందర్రెడ్డి, యాదగిరి భువనగిరి- సందీప్ రెడ్డి, సిద్దిపేట-రోజా శర్మ, మెదక్-హేమలత, సంగారెడ్డి- పటోల్ల మంజుశ్రీ, రంగారెడ్డి-తీగల అనిత రెడ్డి, వికారాబాద్- పట్నం సునీత రెడ్డి, నారాయణపేట- వనజమ్మ, నాగర్కర్నూల్- పద్మావతి పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు.

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం ఒక్కో జిల్లాకు ఎకరం చొప్పున భూమి కేటాయించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ గత ఏడాది డిసెంబర్ 20న వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఒక్కో జిల్లా కార్యాలయానికి రూ.60 లక్షల చొప్పున పార్టీ అధిష్ఠానం కేటాయించింది. అన్ని కార్యాలయాలు ఒకే నమూనాతో నిర్మించనున్నారు.

- Advertisement -