శ్రీ విఠలుడి సన్నిధిలో గ్రీన్ ఛాలెంజ్..

40
- Advertisement -

మహారాష్ట్రలోని పండరీపురంలో ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పండరీపురంలోని శ్రీవిఠలుడి దర్శనం చేసుకున్న భక్తులకు తులసి మొక్కలును అందజేశారు. 10,116తులసి మొక్కలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండింగ్ మెంబర్ రాఘవ భక్తులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ స్పందిస్తూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు పండరీపురంలో అపూర్వ ఆదరణ లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పర్యావరణం, ప్రకృతిని కాపాడాలని చెప్పిన సంత్ తుకారం మహారాజ్‌ ఆశయం నేరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పండరీ పురం విఠలుడి దగ్గరికి తొలి ఏకదశి రోజున వచ్చే భక్తులకు తులసి మొక్కలను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణ, జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఆ తిలకం మర్చిపోలేను… ఫడ్నవీప్ ఉద్వేగం

- Advertisement -