దివీ బయలాజికల్స్ ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్..

18

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఆదివారం దివీ బయలాజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎండీ దుష్యంత్ కుమార్, డాక్టర్ చంద్ర శేఖరన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పఠాన్ చెరువులోని వారి కంపెనీ ప్రాంగణంలో మొక్క నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు.