సీఎం జగన్‌పై చంద్రబాబు ఘటు వ్యాఖ్యలు..

33

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గుడిపల్లిలో రోడ్ షోలో పాల్గొన్నారు. జంగాలపల్లి గ్రామంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. క్రైన్‌తో బారి గజమాలతో చంద్రబాబును సత్కారించారు. టీడీపీ మహిళల కార్యకర్తలు చంద్రబాబుకు హరతులు ఇచ్చి ఆహ్వానించారు. గుడిపల్లి మండలం శెట్టిపల్లి రోడ్ షోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నారు. సినిమా టికెట్లు మాత్రం నియంత్రణ చేయాలి. కానీ భారతి సిమెంట్ రేట్లు మాత్రం పెంచాలి ఇది జగన్ పాలన అని బాబు మండిపడ్డారు. ఉద్యోగులకు 43 ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్నారు.

ఆనాడు రాష్ట్ర విభజన జరిగి ఎన్నో కష్టాల్లో ఉన్న ఉద్యోగులకు న్యాయ పరమైన చర్యలు తీసుకున్నాము. నిన్న ఉద్యోగ సంఘాలను బెదిరించి ఇచ్చిన దాంట్లో తగ్గించారు జగన్ మోహన్ రెడ్డి. ఇదీ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పంచాయతీ. 62 సంవత్సరాల వయో పరిమితిని పెంచడం ఎవరికి లాభం లేదు. ఇదంతా కూడా జగన్ రెడ్డి మాయాజాలం. ఉద్యోగులను బెదిరించి పాలన సాగిస్తున్నాడు అని విమర్శించారు.