హైదరాబాద్‌లో గ్రాండ్ నర్సరీ మేళా

228
grand nursary
- Advertisement -

హైదరాబాద్ పీపుల్స్‌ ప్లాజాలో నేటి నుంచి ఐదు రోజులపాటు గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది. ఈ జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శనను మంత్రులు హరీశ్‌ రావు, నిరంజన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ (టీఈఓ) ఆధ్వర్యంలో ఈ జాతీయ ప్రదర్శన జరగనుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి దేశంలోని ప్రముఖ సంస్థలు, నర్సరీలు 125 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా వివిధ రకాల పూలు, పండ్లు, టెర్రస్‌ గార్డెనింగ్‌ మొక్కలను ప్రదర్శించనున్నారు.

ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ప్రవేశ రుసుము రూ.20. దేశవ్యాప్తంగా వివిధ జాతుల మొక్కలను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కల పెంపకంపై అవగాహన కలిగించనున్నారు. ముఖ్యంగా గార్డెనింగ్‌ మెథడ్స్, టెర్రస్‌ గార్డెనింగ్, వరి్టకల్‌ గార్డెనింగ్, హైడ్రోపోనిక్, కిచెన్‌ గార్డెనింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

- Advertisement -