టాప్ ఈతగాళ్ల జాబితాలో గౌతమ్ ఘట్టమనేని!

243
mahesh
- Advertisement -

ప్రిన్స్ మహేశ్‌ బాబు తనయుడు అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో టాప్ 8 ఈతగాళ్ల లిస్ట్‌లో స్ధానాన్ని సంపాదించాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు మహేశ్‌ భార్య నమ్రత.

బటర్‌ఫ్లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్ & ఫ్రీస్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో గౌతమ్ ఈత కొడతాడని, అతనికి ఫ్రీస్టైల్ అంటే బాగా ఇష్టమని, నీళ్లలో 5 కి.మీ 3 గంటల్లో ఈదగలడని నమ్రత చెప్పుకొచ్చారు.

15 ఏళ్ల గౌతమ్… ఆయుష్ యాదవ్‌ అనే శిక్షకుడి దగ్గర ఈతలో శిక్షణ పొందుతున్నాడు. ఆయుష్ యాదవ్ ఒక ప్రొఫెషనల్ ఈతగాడు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణతో కలిసి రాష్ట్ర కోచ్ గా పని చేస్తున్నాడు.

- Advertisement -