మాట ఇస్తే తప్పని నేత సీఎం కేసీఆర్- ప్రభుత్వ విప్

180
- Advertisement -

గురువారం దళిత బంధుపై టీఆర్ఎస్ఎల్ఫీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ లు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. దళిత బంధు నేటి నుంచి అమలులోకి రావడం హర్షణీయం అన్నారు. దళితులను గతంలో ఓటు బ్యాంకుగానే పాలించిన పార్టీలు పరిగణించేవి. సీఎం కేసీఆర్ దళిత బందును మా నియోజక వర్గం వాసాలమర్రి నుంచి ప్రారంభిస్తామని ప్రకటించడంతో సంభ్రమాశ్ఛర్యాలకు లోనయ్యాం.. మా అదృష్టంగా భావిస్తున్నాం. నిన్న సాయంత్రం ఐదు గంటల తర్వాత సీఎం కేసీఆర్ 72 కుటుంబాలకు 7.6 కోట్ల రూపాయలు ప్రకటిస్తే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకల్లా జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయి. మాట ఇస్తే తప్పని నేత సీఎం కేసీఆర్ అని తెలిపారు.

కాళేశ్వరం మొదలు పెట్టినపుడు ఇది అయ్యేదా పొయ్యేదా అన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో కాళేశ్వరాన్ని పూర్తి చేసినట్టే దళిత బంధును జయప్రదం చేస్తారు. ఎన్ని పార్టీలు పాలించినా దళితుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా ఉంది. దళిత బంధు విజయవంతం అవుతుందని పూర్తిగా నమ్ముతున్నాం. వాసాల మర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన గ్రామస్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. కేసీఆర్‌ను తమ కుటుంబ సభ్యుడిగా భావించి గ్రామస్థులు సమస్యలు చెప్పుకున్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం కేసీఆర్ అభినవ అంబెడ్కర్.. అంబెడ్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారు..అదే స్ఫూర్తితో దళిత బంధు తెచ్చారు. గతంలో దళితులకు పథకాలు కాగితాలపైనే ఉండేవి..అనేక అనుభవాలు ఈ వాస్తవాన్ని రుజువు చేస్తున్నాయి.దళితుల గుండెల్లో సీఎం కేసీఆర్ అభినవ అంబెడ్కర్ గా చిర స్థాయిలో ఉంటారు. దళిత బంధు పథకం అమలులో మహిళల పాత్ర కీలకమని చెప్పడం అభినందనీయం. సీఎం కేసీఆర్‌కు మా నియోజకవర్గం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సీఎం కేసీఆర్ ఏ మంచి పని తలపెట్టినా దానికి అడ్డం పడటం ప్రతి పక్షాలకు అలవాటుగా మారింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి స్కీం ఉందా ?.. అంబెడ్కర్ ను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది .అలాంటి పార్టీకి దళితుల గురించి మాట్లాడే హక్కు ఉందా ? అని ప్రశ్నించారు.

ఎన్నికల కోసం కేసీఆర్ పథకాలు రూపొందించరు..ప్రజల బాగోగులను చూసే పథకాలు అమలు చేస్తారు. దళిత బంధుపై సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకున్నారు. ఎన్నికలు లేనపుడు మా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదా ?.. సీఎం కేసీఆర్ నవ సమాజ స్థాపనకు నడుం బిగించారు. అన్ని వర్గాలకు ఊతమిచ్చి ముందుకు సాగుతున్న నేత సీఎం కేసీఆర్.. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ సీఎం కేసీఆర్ ద్యేయం బంగారు తెలంగాణే అన్నారు. సంకుచిత ఆలోచనలతో రాజకీయ విమర్శలను చేసే వాళ్ళను మేము పట్టించుకోము. ఇపుడు విమర్శిస్తున్న వారే రేపుసీఎం కేసీఆర్ కు జై కొట్టడం ఖాయం అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పేర్కొన్నారు.

- Advertisement -