రైతుల అకౌంట్లలో పీఎం కిసాన్ పెట్టుబడి సాయం..

30
modi

పీఎం-కిసాన్ (ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి) కింద ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేయనున్నారు. ఈ విడతలో రూ. 19000 కోట్లను 9.5కోట్ల మందికి పైగా రైతులకు అందించనున్నారు. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సాయాన్ని మోదీ విడుదల చేయనున్నారు.

పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతుకు ఏడాదికి రూ.6,000 అంద‌జేస్తోంది మోదీ స‌ర్కార్. ఆ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జ‌మ‌చేస్తూ వ‌స్తున్నారు.