రాష్ట్రంలో కొత్తగా 4,693 కరోనా కేసులు నమోదు..

35
corona

తెలంగాణలో కొత్తగా 4,693 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,16,404కు చేరింది. గడిచిన 24 గంటల్లో 33 మంది మరణించగా.. ఇప్పటివరకు 2,867మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 6876 మంది డిశ్చార్జ్‌ అవ్వగా.. ఇప్పటివరకు 4,56,620 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 56,917 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 71,221 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 1,38,94,962 మందికి కరోనా పరీక్షలు జరిగాయి.