సాగుపై చర్చించడానికి రైతువేదికల నిర్మాణం: సబితా

44
sabitha

రైతులు సాగుపై చర్చించుకోవాడానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,604 రైతు వేదికలు నిర్మాణం చేపట్టామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండల కేంద్రంలో రైతు వేదికను, పాఠశాల అదనపు గదులు, లైబ్రరీ భవనాన్ని, ఎల్లకొండ గ్రామంలో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సబితా…అన్నం పెట్టే రైతన్నకు కన్నీరు రాకుండా చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందరం అండగా ఉందామన్నారు.రైతుబంధు కింద 7,500 కోట్లను అన్నదాతలకు పంపిణీ చేశామన్నారు. పంటలకు మద్దతు ధర వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి ఎల్లకొండ శివాలయంలో పూజలు చేశారు.