ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు..

29
minister harish
- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఆయన మంగళవారం మంథని పట్టణంలో 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు మంత్రి హరీష్‌.

మంత్రి హరీష్‌ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో 80% ప్రసవాల దిశగా ప్రత్యేక కృషి చేయాలన్నారు. సీజేరియన్ ఆపరేషన్లపై పారదర్శకంగా ఆడిట్ నిర్వహణ చేపట్టాలన్నారు. సోమవారం నుంచి మాతా శిశు సంరక్షణ కేంద్రాల సేవలు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రులలో పారిశుద్ద్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద వహించాలని తెలిపారు.

ఈ సమీక్షలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పెద్దపెల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -