షాక్..పెట్రోమంట రూ.10 పెంపు..!

267
petrol price
- Advertisement -

కరోనాతో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయింది. ముఖ్యంగా చమురు ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడంతో ధరలు భారీగా పతనం అయ్యాయి. అయినా భారత్‌లో మాత్రం పెట్రోల్ ధరలు తగ్గడం లేదు. ఎక్సైజ్ సుంకం పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోంది. తాజాగా పెట్రోల్ పై రూ. 10, డీజిల్‌పై 13 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా కేంద్రం పెంచిన ధరలతో… దేశంలో లీటర్ పెట్రోలుకు దాదాపు 33 రూపాయలు ఎక్సైజ్ సుంకం రూపంలోనే కేంద్రం ఖజానాలోకి వెళ్లనుంది. కరోనా లాక్‌డౌన్ వేళ ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గిపోయిన సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

2014లో మోడీ ప్రధాని అయినప్పుడు పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం కేవలం తొమ్మిదన్నర రూపాయలు మాత్రమే ఉంటేది. అదిప్పుడు పెరుగుతూ పెరుగుతూ వచ్చి.. 33 రూపాయలకు చేరుకుంది.

- Advertisement -