తెలంగాణ ప్రభుత్వం 45 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచితంగా డయాలసిస్ చేయడానికి ఏర్పాటు చేసింది… భవిష్యత్తులో వీటిని మరింత పెంచుతాం అన్నారు మంత్రి ఈటల రాజేందర్. జెనిటో యూరినరీ సర్జన్స్ అన్యువల్ కాన్ఫరెన్స్ కి గవర్నర్ తమిళ ఇసై సౌందరరాజన్, ఈటల రాజేందర్, ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
కిడ్నీ సమస్యలు వస్తే ఆ కుటుంబం కొలాప్స్ అవుతుంది…డయాలసిస్ కోసం నెలలో పది రోజులు హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది… కాబట్టి డాక్టర్లు మానవీయ కోణంలో చికిత్స అందించాలన్నారు మంత్రి ఈటల. ఆరోగ్యశ్రీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 900 కోట్లు ఖర్చు పెడితే అందులో అత్యధికంగా 200 కోట్లు గుండె సమస్యల కోసం ఖర్చు పెడుతుండగా.. మూడో స్థానంలో కిడ్నీ సమస్యలు ఉన్నాయి. 175 కోట్లు కిడ్నీ సమస్యల కోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు అందిస్తున్నాం అని చెప్పారు.
చికిత్స కంటే నివారణ ముఖ్యంగా అనే కోణంలో లో వైద్య ఆరోగ్య శాఖ ను తీర్చిదిద్దుతున్నం…రోగాలకు చికిత్స అందిస్తూ నే రోగాలు రాకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణం లో ఒకటి తాగేనీరు కూడా కావడంతో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందజేస్తున్నాం… నీటిపారుదల ప్రాజెక్టులు ఏర్పాటు చేసి సాగునీరు కూడా అందించి పంటల ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
“వైద్యో నారాయణో హరి ” వైద్యులు దేవుళ్ళతో సమానం కానీ చాలా చోట్ల వారి మీద దాడులు జరుగుతున్నాయి.. వీటిని అరికట్టాల్సిన బాధ్యత మాపై ఉంది అదే సమయంలో వ్యక్తులు గా మీరు కూడా ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు మానవీయ కోణంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.
అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించే క్రమంలో ఒక మాట అన్నారు తను చనిపోయిన తర్వాత ఒక చెయ్యిని పైకి ఉంచి పూడ్చి పెట్టాలని కోరారు అంటే చనిపోయాక ఉత్త చేతులతోనే వెళ్తాం తప్ప ఏమీ తీసుకు పోము అని అందరికీ తెలుసు… అందుకే ఎంత సంపాదించిన వెళ్లేటప్పుడు తీసుకు పోయేది లేదు కాబట్టి మానవతా దృక్పథంతోనే పని చేయాలని కోరుతున్నామన్నారు.