గోవిందా భజ గోవిందా మూవీ ఫ‌స్ట్‌లుక్..

88
gbg

విజయ శ్రీ క్రియేషన్స్ ప‌తాకంపై డాలీ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన‌ గోవిందా భజ గోవిందా మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ ని ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి హీరోగా దుర్మార్గుడు ఫేమ్ విజయ్ కృష్ణ, హీరోయిన్ గా ప్రియా శ్రీనివాస్ నటించారు. అలాగే కో ఆర్టిస్టులుగా కమల్ తేజ, సూర్యతేజ, తేజ త‌దిత‌రులు నటించడం జరిగింది. ఈ సినిమాకి సూర్య కార్తికేయ & ఉపేంద్ర నిర్మాత‌లు.

ఈ సినిమా పూర్తిగా హాస్యభరితంగా ఉంటుందని ఫ్యామిలి తో వచ్చి హ్యాపిగా నవ్వుకోవచ్చని దర్శకుడు సూర్య కార్తికేయ తెలిపారు. ఎన్నో సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసి ఇప్పుడు మొదటి సారిగా దర్శకుడిగా, నిర్మాతగా గోవిందా భజ గోవిందా చిత్రాన్ని నిర్మించారాయ‌న‌. ఈ చిత్రం నవ్వును కోరుకునే వాళ్ళు కచ్చితంగా నవ్వుకోని హ్యాపీగా తిరిగి వస్తారని దర్శకుడు తెలిపారు.