కార్ రేసర్‌ అవతారమెత్తిన అందాల బ్యూటీ..!

108
nivetha
- Advertisement -

మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ నివేతా పేతురాజ్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన కిష్టమైన ఫార్ములా కార్ రేసింగ్‌లో సత్తాచాటుతోంది. తాజాగా ఫార్ములా రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో లెవెల్ 1లో సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. మొమెంటమ్ – స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్ సంస్థ నుండి నివేతా పేతురాజ్ ఈ సర్టిఫికెట్ ను పొందింది.

ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా షేర్ నివేతా షేర్ చేయగా అభిమానులు విషెస్ చెబుతున్నారు. తెలుగులోనే కాకుండా పలు తమిళ చిత్రాల్లోనూ నివేతా నటిస్తోంది. ప్రస్తుతం ‘విరాటపర్వం’,వెంకట్ ప్రభు రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘పార్టీ’, ఎ. ఎల్. విజయ్ ఫిమేల్ సెంట్రిక్ మూవీ ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ సినిమాల్లో నటిస్తోంది.

మెంటల్ మదిలో సినిమా తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలలో నటించింది. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ ‘రెడ్’లో కీలక పాత్ర పోషించింది.

- Advertisement -