దేశంలో పవర్‌ఫుల్ పర్సన్స్ ఓటర్లేనని చెప్పారు గవర్నర్ తమిళి సై. హైదరాబాద్ రవీంద్రభారతిలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్..ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ కుల,మత,,డబ్బు ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసి ఓటు విలువను కాపాడాలని ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు.
వరుసగా మూడు ఎన్నికలను సమర్థవంతంగా ఎక్కడ రీ పోలింగ్ లేకుండా నిర్వహించిన ఎన్నికల అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే మొదటగా తెలంగాణలో ఫేస్ యాప్ ద్వారా దొంగ ఓట్లను గుర్తించే పద్ధతిని తీసుకొచ్చారని చెప్పారు. ఓటరుగా గర్వపడుతున్నా…డెమోక్రసీలో ఓటు విలువ గొప్పదని చెప్పారు.
ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి..గ్రామంలో, పట్టణాల్లో ఉన్న పక్కింటివారితో..బంధువులతో వేయించాలన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుంది…ఓటర్లలో చైతన్యం తీసుకురావాలన్నారు. డ్యూటీలో ఉన్న ఎన్నికల అధికారులను.. రక్షణగా ఉన్న పోలీసులను గౌరవించాలన్నారు.
ప్రతీ సంవత్సరం ఓటర్ల దినోత్సవం రోజున ఒక నూతన కార్యక్రమంను మొదలుపెడుతున్నాం అన్నారు సీఈఓ రజత్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా అసెంబ్లీ, పార్లమెంటు,, స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం అన్నారు. నిజామాబాద్ లో 12 ఈవీఎంలతో 1085 మంది అభ్యర్థులతో ఎన్నికను నిర్వహించి జాతీయ స్థాయిలో రికార్డు సాధించాం అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైందన్నారు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు అధికారులు అవార్డులు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. జగిత్యాల కలెక్టర్ శరత్..హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఇద్దరికి జాతీయ ఎన్నికల అవార్డులు వచ్చాయని చెప్పారు.