- Advertisement -
ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నేడు రాజ్ భవన్ లో గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనా వైరస్ ప్రబలకుండా అరికట్టగలమని అన్నారు. తెలంగాణలో ఎవరికి కరోనా రాలేదని..ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వచ్చినట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలి. విదేశాల నుంచి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆదివారం నాడు రాజ్‌భవన్‌లో కూడా జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్నాం. రాజ్‌భవన్‌లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కరోనాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని’ గవర్నర్ సూచించారు. దేశ వ్యాప్తంగా 223 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- Advertisement -