- Advertisement -
గవర్నర్ తమిళి సైకి తృటిలో ప్రమాదం తప్పింది. తమిళనాడులోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నడస్తూ నడుస్తూ ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయారు.వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను పైకిలేపారు. అయితే గవర్నర్‌కు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అయితే తాను కిందపడిపోయినందున ఈ వార్త టీవీల్లో బ్రేకింగ్ న్యూస్, బిగ్ న్యూస్ అవుతుందని చమత్కరించారు గవర్నర్ తమిళి సై. ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి పెద్దగా చర్చ జరుగుతుందో లేదోకానీ తాను కిందపడిపోవడం మాత్రం పెద్ద వార్తవుతుందంటూ సరదాగా పేర్కొన్నారు.
మామల్లాపురం సమీపంలోని పత్తిపురం గ్రామంలో జరిగిన మొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -