రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్: తమిళి సై

38
darbar
- Advertisement -

వచ్చే నెల నుండి రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు గవర్న్ తమిళి సై. ఇవాళ రాజ్‌భవన్‌ వేదికగా జరిగిన ఉగాది వేడుకల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గవర్నర్. వివిధ పార్టీలకు చెందిన నేతలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు పుదుద్చేరి మంత్రులు, స్పీకర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు.

ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఆప్యాయంగా ఉండాలని.. కలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం అని తెలిపారు. రాజ్ భవన్ లిమిటేషన్స్ తనకు తెలుసు… ఉత్ప్రేరకంగా పని చేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రజల్ని ప్రేమిస్తాను.. తనని ఎవరూ నియంత్రించలేరన్నారు.

- Advertisement -