పేదలకు,స్ట్రీట్ వెండర్స్ కి ఆత్మనిర్బర్ భారత్ ఎంతో ఉపయోగపడుతుంది ఇది దేశానికి రోల్ మాడల్ అన్నారు గవర్నర్ తమిళి సై. హదరాబాద్ రాజ్ భవన్‌లో ఆత్మనిర్బర్ భారత్ లో బాగంగా రాజ్ భవన్ సిబ్బంది కుటుంబ సభ్యులకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తమిళి సై ….రాజ్ భవన్ పరివార్ లోని మహిళలు అందరూ ఎంబ్రాయిడరీ వర్క్ ,కుట్టు పనులు ,ఇతర పనులు నేర్చుకోండి మీరు కుడా డబ్బు సంపాదించుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్థికంగా బలపడేందుకు అందరూ ఎదో ఒక పని చేసుకోవాలి….రాజ్ భవన్ పరివార్ ఆర్థికంగా బలపడాలి….ప్రధాని నరేంద్రమోడీ ఈ కోవిడ్ సమయంలో మహిళలకోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.
సమాజం ,కుటుంబం ఆర్థికంగా పరిపుష్టి సాధించాలంటే మహిళల పాత్ర ఎంతగానో ఉంటుంది….కోవిడ్ ఇప్పట్లో పోదు కావున అందరం జాగ్రత్తలు పాటించాలి మనం అందరం ఎదో ఒక పని చేసుకోని ఆర్థికంగా బలపడాలన్నారు.అందరూ ఎప్పటికప్పుడు కోవిడ్ రాకుండా ఉండేందుకు హాండ్ సానిటైజ్ చేసుకోవాలి ,మాస్క్ ధరించాలి ,భౌతిక దూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.