- Advertisement -
సినిమా టికెట్ రేట్లపై ఏపీ సర్కార్‌దే తుది నిర్ణయం అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. మంత్రి పేర్ని నాని తో రెండు గంటల పాటు సమావేశమయ్యారు ఆర్జీవీ. అనంతరం మాట్లాడిన ఆర్జీవీ…సినిమా ధరల టికెట్ల అంశంపై మంత్రి పేర్నినాని తో చర్చించానని చెప్పారు. చిత్రానిర్మాణ రంగానికి ,ప్రేక్షకులకు మధ్య ప్రభుత్వం ఎందుకు? అన్నారు.
తాను చిత్రపరిశ్రమ తరుపున రాలేదు…నిర్మాతగా మాత్రమే నా అభిప్రాయం ప్రభుత్వంకు చెప్పడానికి వచ్చానని చెప్పారు. తాను చెప్పాల్సింది చెప్పానని తుది నిర్ణయం ప్రభుత్వానిదేనన్నారు.
RRR, రాధేశ్యామ్ వంటి పెద్ద చిత్రాలు విడుదల వాయిదా పడడానికి టికెట్ల ధరలు ఒక కారణం అనుకుంటున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్,బాలకృష్ణ సినిమాలు ఉద్దేశించి టికెట్ల ధరలు ప్రభుత్వం తగ్గించింది అనే దానిలో వాస్తవం లేదన్నారు.
- Advertisement -