గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కిషన్ రెడ్డి..

11
kishan reddy

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బూస్టర్ టికాల కేంద్రాన్ని పర్యవేక్షించారు. 60ఏళ్ళు పైబడిన వారంతా బూస్టర్ టికాలను తీసుకోవాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్ లు, కోవిడ్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్వేచ్చనిచ్చిందన్నారు.

ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ అధికారులతో ప్రధాని పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. అతిత్వరలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చిస్తారన్నారు. కోవిడ్ ఉత్పత్తులను ఇతర దేశాలకు చేస్తున్న ఎగుమతులు రద్దు చేశామన్నారు. మన దేశంకో తయారైన వ్యాక్సిన్ చాలా బాగా పనిచేస్తున్నాయన్నారు.