సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలుః ఆర్యవైశ్య సంఘం నేతలు

482
aryavaisya mahasabha
- Advertisement -

మేడ్చల్ జిల్లాలో ఆర్యవైశ్య మహాసభకు ఐదు ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం. నగరంలోని ఉప్పల్ భగాయత్ లే ఔట్‌లో ఈ భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ భవన్ లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, ఐవిఎఫ్ అధ్యక్షలు ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాలో ఆర్యవైశ్యుల కు ప్రభుత్వం తరపున 5 ఎకరాల స్థలాన్ని కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్యవైశ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గతంలో అసెంబ్లీలో రెండు అంశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రస్తావించాను అందులో భాగంగా మొదటి ది 5 ఎకరాల స్థలం ను కేటాయించారు , రెండవది కార్పొరేషన్ ను కూడా త్వరలోనే ఇస్తారనే పూర్తి నమ్మకం మాకు ఉంది. టి.ఆర్.ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యుల ను గుర్తించి వివిధ పదవులను కేటాయించారు. సీఎం కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారన్నారు.

government allocated five acres of land to the aryavaisya mahasabha

- Advertisement -