కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న గోరటి వెంకన్న..

233
- Advertisement -

తెలంగాణ కవి,రచయిత,టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ 2021 అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈరోజు ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర కంబరా చేతుల మీదగా గోరటి వెంకన్న అవార్డు అందుకున్నారు. గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకితాళం’ కవిత సంపుటికి గాను సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ.. సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉంది. కవితా సంపుటిని గుర్తించిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.సీఎం కేసీఆర్,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, పలువురు అభినందనలు తెలపడం ఆనందంగా ఉంది. నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.గతంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ద్వారా ఎన్వీ రమణ చేతులమీదుగా అవార్డు కూడా తీసుకున్నాను అని తెలిపారు.

- Advertisement -