TTD: శాస్త్రోక్తంగా గోపూజ

46
- Advertisement -

కార్తీక మాసంలో టీటీడీ త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా బుధ‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో గోపూజ‌ శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఉద‌యం 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ముందుగా రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారిని వ‌సంత మండ‌పంలో కొలువుతీర్చారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ సనాతన ధర్మంలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గోపూజ ముక్కోటి దేవతల పూజాఫలంతో సమానమని అన్నారు.

ముందుగా కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం చేశారు. ఆ త‌రువాత స్వామి, అమ్మ‌వార్ల‌కు తిరువారాధ‌న చేశారు. అనంతరం ఆవు, దూడకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. గోప్ర‌ద‌క్షిణ చేశారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

Also Read:నేరేడుపండుతో ఆరోగ్య ప్రయోజనాలు?

- Advertisement -