స్టైలిష్‌ లుక్‌తో ‘గౌతమ్‌నంద’

243
Gopichand's Gautham Nanda First Look Posters

ఇటీవలె ఆక్సిజన్‌ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న గోపిచంద్ మరోసినిమాను పట్టాలెక్కించాడు. అయితే లాంగ్ గ్యాప్‌ తర్వాత టాలీవుడ్‌లో బిజీగా మారాడు గోపిచంద్. ఈ సినిమా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపిచంద్ ద్విపాత్రాభినయం చేయబోతునట్లు సమాచారం.

ఇప్పటివరకు గోపిచంద్ డ్యూయల్ రోల్స్ లో కనిపించిందే లేదు. అయితే ఈ సినిమాలో మొదటిసారిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు గోపిచంద్‌. దీనికోసం దర్శకుడు సంపత్ కథ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడట.

Gopichand's Gautham Nanda First Look Posters

తొలుత ఈ చిత్రానికి బలం అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ‘గౌతమ్‌ నంద’ టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు. అయితే హృతిక్ రోషన్ తన కాబిల్ చిత్రాన్ని బలం పేరుతో తెలుగులో విడుదల చేయటంతో ఈ సినిమా పేరును గౌతమ్ నందాగా ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఉగాది కానుకగా విడుదల చేశారు చిత్రటీమ్‌. ఇందులో గోపిచంద్ స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తూ.. సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆక్సిజన్” షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. .గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు.