గోపీచంద్ ‘సీటీమార్’ టీజ‌ర్‌..

274
- Advertisement -

యాక్షన్ హీరో గోపీచంద్ న‌టిస్తోన్న కొత్త సినిమా ‘సీటీమార్’. క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను మాస్ డైరెక్టర్ సంపత్ నంది రూపొందిస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజ‌ర్‌ను ఈ రోజు ఆ సినిమా యూనిట్ ఈ రోజు విడుద‌ల చేసింది. ఆయ‌న చేస్తోన్న ఫైటింగులు ప్రేక్ష‌కుల‌తో ‘సీటీమార్’ అనిపించేలా ఉన్నాయి. గోపీచంద్ సీటీ వేయ‌డంతో ఈ టీజ‌ర్ ముగుస్తుంది.

ఇందులో త‌మ‌న్నా, దిగంగన సూర్యవంశి, భూమిక, రావు రమేశ్ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇందులో ఐటెంసాంగ్ లో అప్స‌ర రాణి క‌న‌ప‌డ‌నుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

https://youtu.be/-hl0taByHlc
- Advertisement -