టీఆర్ఎస్ చేరిన కాంగ్రెస్ నేతలు..

17
trs

రాయపర్తి మండలం ఆరె గూడెంకి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఆ పార్టీ కి రాజీనామా చేసి, టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హన్మకొండలో వాళ్లకు గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్ లోకి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆహ్వానించారు.ఈ సదర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, దేశంలో 60లక్షల సభ్యత్వం ఆన్లైన్ చేసిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అని అన్నారు. పార్టీ లోని ప్రతి సభ్యుడికి భీమా చేసిన ఘనత కూడా టీఆర్‌ఎస్ కే దక్కుతుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి సభ్యుడికి సముచిత గౌరవం దక్కుతుందని చెప్పారు.

టీఆరెఎస్ లో చేరిన వారిలో…యార మహేందర్, యారా ఉపేందర్, అనుమల యాకయ్య, యారా సుధాకర్, యారా నాగయ్య, యారా కరుణాకర్,అనుమల పెద్ద యాకయ్య, పెండ్లి మల్లేష్, ముస్కు రాంరెడ్డి, ముస్కు ప్రదీప్, యారా సంపత్ త ఉన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో PACS మాజీ చైర్మన్ బిళ్ల సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మూనవత్ నర్సింహ నాయక్, జడ్పిటిసి రంగు కుమార్,ఎంపిపి అనిమి రెడ్డి, సురేందర్ రావు, ఆరె గూడెం సర్పంచ్ పెండ్లి రజిని సుధాకర్, పార్టీ సీనియర్ నాయకులు మల్లకారి మధు, టీఆర్ఎస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు నర్మద తదితరులు పాల్గొన్నారు.