గోపాల కృష్ణయ్యకు కాంస్య పతకం

79
gopala
- Advertisement -

నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్‌లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్-2022లో తెలంగాణకు చెందిన దుద్యాల గోపాల కృష్ణయ్య 80 కిలోల పురుషుల విభాగంలో తైక్వాండో క్యోరూగిలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. జూలై 22 నుంచి 31 వరకు జరుగుతున్న ఈ క్రీడల్లో తెలంగాణ పోలీసు విభాగానికి ప్రాతినిధ్యం వహించి ఈ ఘనత సాధించారు. వికారాబాద్ జిల్లా రామయ్యగూడ గ్రామానికి చెందిన అతను 2003 సంవత్సరంలో పోలీస్ శాఖలో చేరారు. ప్రస్తుతం డిప్యుటేషన్ ప్రాతిపదికన 2015 నుండి విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్నారు. కాంస్య పతకం సాధించి తెలంగాణ పోలీసు శాఖకు గర్వకారణమైన గోపాల కృష్ణయ్యను విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ అంజనీకుమార్ అభినందించారు.

- Advertisement -