పీవీ సింధు ఖాతాలో మ‌రో బ్రాంజ్ మెడ‌ల్..

60

టోక్యో ఒలింపిక్స్ భారత మహిళా అథ్లెట్ల దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే మీరా భాయ్ చాను, లవ్లీనా భారత్ కు పతకాలు ఖాయం చేయగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లో తెలుగు తేజం పీవీ సింధు చేరింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జ‌రిగిన మ్యాచ్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వ‌రుస గేమ్స్‌లో విజ‌యం సాధించింది. దీంతో సింధు ఖాతాలో మ‌రో బ్రాంజ్ మెడ‌ల్ చేరింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ సింధు సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో రెండు మెడ‌ల్స్ గెలిచిన తొలి భార‌త మ‌హిళ‌గా నిలిచింది.

శనివారం సెమీస్‌లో ప‌రాజ‌యం పాల‌వ‌డంతో గోల్డ్ మెడ‌ల్ గెల‌వాల‌న్న ఆమె ఆశ‌లు అడియాస‌లయ్యాయి. అయితే ఆ ఓట‌మి నుంచి ఒక రోజు వ్య‌వ‌ధిలోనే సింధు కోలుకుంది. బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్‌లో క‌ఠిన‌మైన చైనా ప్ర‌త్య‌ర్థిపై తొలి గేమ్ నుంచే పైచేయి సాధిస్తూ వ‌చ్చింది. సింధు తన దూకుడైన ఆటతో ప్రత్యర్థి ఆట కట్టించింది.