గూగుల్ సేవలకు అంతరాయం….

212
google
- Advertisement -

ప్ర‌పంచ‌వ్యాప్తంగా గూగుల్ స‌ర్వ‌ర్లు డౌన్ అయ్యాయి. సాయంత్రం 5 గంటల నుండి గూగుల్ సంబంధిత యూట్యూబ్‌, జీమెయిల్‌, మీట్‌తోపాటు ప‌లు ఇత‌ర యాప్స్‌, సేవ‌లు ప‌ని చేయ‌డం లేదని గూగుల్ వెల్లడించింది. త్వరలోనే ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేస్తామని గూగుల్‌ ప్రకటించింది.

ప‌లువురు యూజ‌ర్లు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌పై యూట్యూబ్‌ను ఓపెన్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. స‌ర్వర్‌కు క‌నెక్ట్ కాలేక‌పోతున్నామ‌న్న మెసేజ్ వ‌స్తోంది. అయితే ప‌లువురి డెస్క్‌టాప్‌ల‌పై మాత్రం ఇవి ఓపెన్ అవుతున్నాయి. షెడ్యూల్డ్ మెయింట‌నెన్స్‌, చిన్న చిన్న బ‌గ్స్‌లాంటివి ఈ స‌మ‌స్య‌ల‌కు కార‌ణంగా చెప్పొచ్చు.

- Advertisement -