కొత్త ఐటీ చట్టాలకు కట్టుబడి ఉన్నాం: గూగుల్ సీఈవో

174
google
- Advertisement -

భారత్ తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలకు కట్టుబడి ఉన్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. కొత్త ఐటీ చట్టాలపై మాట్లాడిన ఆయన తమ లోక‌ల్ టీమ్స్ కొత్త చట్టాలపై విశ్లేషిస్తున్నార‌ని, త‌మ సేవ‌లు ఉన్న అన్ని దేశాల్లోనూ స్థానిక చ‌ట్టాల‌ను గౌర‌విస్తామ‌ని వెల్లడించారు.

ప్ర‌భుత్వాలు చేప‌డుతున్న చ‌ర్య‌ల‌కు అనుగుణంగా తాము సేవ‌లు అందించ‌నున్నామని….వారితో క‌లిసి ప‌నిచేస్తామ‌ని, త‌మ నివేదిక‌ల‌న్నీ పార‌ద‌ర్శ‌కంగా ఉన్నాయ‌ని సుంద‌ర్ పిచాయ్ చెప్పారు. టెక్నాల‌జీతో ప్ర‌పంచ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని, సాంకేతిక ప‌రిజ్ఞానం స‌మాజాన్ని మార్చేసింద‌న్నారు.

యూరోప్‌లో కాపీరైట్ ఆదేశాలు ఉన్నాయ‌ని, భార‌త్‌లో సమాచార నియంత్ర‌ణ ఉంద‌ని, ఇలా వివిధ దేశాల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణించి తాము ముందుకు వెళ్తున్న‌ట్లు తెలిపారు.

- Advertisement -